మ్యూజిక్ స్కూల్ ట్రైలర్: పిల్లల కలలను పట్టించుకోవాలని చెప్పే కథ
శ్రియా శరణ్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రలో రూపొందిన మ్యూజిక్ స్కూల్ ట్రైలర్ ని ఈరోజు మద్యాహ్నం, విజయ్ దేవరకొండ లాంచ్ చేసారు. సాధారణంగా పిల్లలకు చదువు తప్ప మరేదీ నేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. ఒకవేళ పిల్లలు, చదువులో కాకుండా ఆటలు, మ్యూజిక్ మొదలగు వాటి మీద ఆసక్తి చూపిస్తుంటే, వాళ్ళమీద కోప్పడే తల్లిందండ్రులు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇదే కాన్సెప్ట్ తో మ్యూజిక్ స్కూల్ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా జాయిన్ అవుతుంది శ్రియ. తన మ్యూజిక్ క్లాసుకు పిల్లలు పెద్దగా అటెండ్ అవరు. చదువు తప్ప పిల్లలు వేరే విషయం అవసరం లేదని స్కూల్ ప్రిన్సిపాన్ చెబుతుంటాడు.
డ్రామా టీచర్ గా కనిపించే శర్మాణ్ జోషి
అదే స్కూల్ లో డ్రామా టీచర్ గా కనిపించే శర్మాణ్ జోషి, మ్యూజిక్ స్కూల్ ఏర్పాటు చేయమని శ్రియా పాత్రకు సలహా ఇస్తున్నట్టుగా చూపించారు. వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నట్టుగా చూపించారు. మ్యూజిక్ ట్రైనింగ్ కోసం పిల్లలతో కలిసి గోవా వెళ్తుంది శ్రియా. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు సినిమాలో కీలకంగా ఉంటాయన్నట్టుగా చూపించారు. ఈ సినిమాకు ఇళయ రాజా సంగీతం అందించారు. యామినీ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను పాపారావ్ బియ్యాల నిర్మించి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు సంస్థ ఎస్వీసీ బ్యానర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో మే 12వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.