NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం.. దసరాకు టీజర్ రిలీజ్? 
    తదుపరి వార్తా కథనం
    ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం.. దసరాకు టీజర్ రిలీజ్? 
    విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు ఫ్యామిలీ స్టార్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు

    ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం.. దసరాకు టీజర్ రిలీజ్? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 13, 2023
    09:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ, ఒక మోస్తారు విజయాన్ని అందుకున్నాడు.

    ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ జాబితాలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో గీతగోవిందం దర్శకుడు పరుశురామ్ తో చేస్తున్న సినిమా కూడా ఉంది.

    దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

    విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది.

    ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం బయటకు రాలేదు. దసరా కానుకగా అక్టోబర్ 18వ తేదీన ఫ్యామిలీ స్టార్ టైటిల్ ని విడుదల చేయనున్నారట.

    Details

    విజయదశమి కానుకగా టీజర్ ను విడుదల చేసే ప్లాన్ లో చిత్రబృందం 

    సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్, మజిలీ, మైఖేల్ సినిమాల్లో నటించిన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా టీజర్ కూడా విజయదశమి కానుకగా అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

    పరశురామ్ గత చిత్రాల మాదిరిగానే ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని సమాచారం.

    ఫ్యామిలీ స్టార్ సినిమాను సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్రా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

    అదలా ఉంచితే, జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరొక సినిమా చేస్తున్నారు. అలాగే దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలా దర్శకత్వంలోనూ నటిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయ్ దేవరకొండ
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు  ఐసీసీ
    Mistakes: మీరు చేస్తున్న ఈ నాలుగు తప్పులే... విజయాన్ని దూరం చేస్తూ, ఓటమిని దగ్గర చేస్తున్నాయ్.. వాటిని ఇవాళే మార్చుకోండి! జీవనశైలి
    Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. చివరి గంటలో ఊపందుకున్న సూచీలు స్టాక్ మార్కెట్
    Vitamin P: విటమిన్ 'పీ' గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ పోషకపదార్థం సమృద్ధిగా లభించే ఆహారాలివే..! ఆరోగ్యకరమైన ఆహారం

    విజయ్ దేవరకొండ

    సమంత ఎస్ చెప్పడంతో రెండు సినిమాలను ఒకేసారి తీసుకురానున్న విజయ్ దేవరకొండ తెలుగు సినిమా
    గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ తెలుగు సినిమా
    ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం తెలుగు సినిమా
    ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    హాయ్ నాన్న మూవీ: సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్  హాయ్ నాన్న
    వసూళ్లలో దూసుకుపోతున్న రామ్ పోతినేని 'స్కంద': 50కోట్ల క్లబ్‌లో చేరిన మూవీ!  రామ్ పోతినేని
    ఓటీటీలోకి వచ్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    కాలి గాయాలతో ఇబ్బందిపడుతున్న పూజా హెగ్డే: ఆందోళనలో అభిమానులు  సినిమా

    సినిమా

    lokesh kanagaraj prabhas: నా చివరి సినిమా ప్రభాస్‌తోనే: లోకేష్ కనగరాజ్ ప్రభాస్
    సమంత పెంపుడు కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది? ఇంటర్నెట్లో చర్చ రేపుతున్న పోస్ట్  సమంత
    షారుక్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు: Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం  షారుక్ ఖాన్
    కిస్మత్ ఫస్ట్ లుక్: సత్యదేవ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ చూసారా?  ఫస్ట్ లుక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025