Page Loader
అభిషేక్‌ పిక్చర్స్‌పై విజయ్ దేవరకొండ తండ్రి ఆగ్రహం
అభిషేక్‌ పిక్చర్స్‌పై విజయ్ దేవరకొండ తండ్రి ఆగ్రహం

అభిషేక్‌ పిక్చర్స్‌పై విజయ్ దేవరకొండ తండ్రి ఆగ్రహం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 09, 2023
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండను ఉద్దేశించి అభిషేక్‌ పిక్చర్స్‌ చేసిన వ్యాఖ్యలపై అతని తండ్రి గోవర్థన్ రావు దేవరకొండ స్పందించారు. విజయ్ పై ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ వసూళ్లకు సంబంధించి పంపిణీదారుగా ఉన్న అభిషేక్‌ పిక్చర్స్‌ ఇటీవలే డిస్టిబ్యూటర్లకు కూడా డబ్బు చెల్లించాలని ట్వీట్ చేసింది. అభిషేక్‌ నామా వ్యాఖ్యలపై గోవర్ధన్ రావు అసహనం వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్‌ నష్టపోతే, పరిహారం చెల్లించాల్సిన అవసరం తమకు లేదన్నారు. మూవీ ఫెయిల్ కావడంతో విజయ్‌ 50శాతం పారితోషికాన్ని నిర్మాత కె.ఎస్‌.రామారావుకు వెనక్కి ఇచ్చేశాడన్నారు. ఆయన ఇస్తానన్న ఫ్లాట్‌ను కూడా విజయ్‌ తీసుకోలేదన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్‌ అభిషేక్‌ నామాతో తమకు సంబంధం లేదని తేల్చారు. చాలారోజుల నుంచి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

5వ తేదీన అభిషేక్ పిక్చర్స్ చేసిన ట్వీట్