Page Loader
Vijay Deverakonda: అందులో భాగం కావడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

Vijay Deverakonda: అందులో భాగం కావడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల విడుదలైన "సాహిబా" మ్యూజిక్ ఆల్బమ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఆల్బమ్ యువతలో భారీ ఆకర్షణ పొందిన విషయం తెలిసిందే. ఈ పాటపై తాజాగా ఆయన ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

వివరాలు 

విడుదలైన ఐదు రోజుల్లోనే  1 కోటి వ్యూస్‌ 

''ఈ పాటను మొదటిసారిగా విన్నప్పుడు, ఇది సూపర్‌హిట్‌ అవుతుందని అనిపించి.. అదే భావనను జస్లిన్‌కి కూడా చెప్పా. నేను మ్యూజిక్ ఆల్బమ్‌లలో భాగమవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు, అందుకే చాలా కాలం ఈ ప్రాజెక్ట్‌ను వాయిదా వేస్తూనే ఉండి, ఆమె అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పేవాడిని. కానీ ఆమె ఆసక్తిని చూసి, ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యా'' అని విజయ్ తెలిపారు. 'హీరియే' పాటతో గుర్తింపు పొందిన జస్లిన్ రాయల్, ఈ పాటకు సంగీతం సమకూర్చారు. ''సాహిబా''లో రాధికా మదన్, విజయ్ దేవరకొండ నటించారు. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో 1 కోటి వ్యూస్‌ను అధిగమించింది. ఈ పాట ప్రమోషన్స్‌లో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో చర్చకు వస్తున్నాయి.

వివరాలు 

కో-స్టార్స్‌తో ఎప్పుడైనా డేటింగ్‌ చేశారా?

విజయ్ తన ప్రేమ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ''ప్రేమ అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఒకరి ప్రేమను పొందడం ఎలా అనేదాన్ని కూడా తెలుసు. కానీ, షరతుల్లేని ప్రేమ తెలియదు ఎందుకంటే నా ప్రేమ అంచనాలతో వస్తుంది. నా వయస్సు 35 సంవత్సరాలు. నేను సింగిల్‌గానే ఉన్నాననుకుంటున్నారా?" అని ఆయన ప్రశ్నించారు. కో-స్టార్స్‌తో ఎప్పుడైనా డేటింగ్‌ చేశారా? అన్న ప్రశ్నకు విజయ్ ''అవును'' అని సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించాయి, విజయ్ గురించి చర్చలు ఎక్కువయ్యాయి. మరోవైపు, విజయ్ ప్రస్తుతం 'VD12' సినిమా మీద పని చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.