Loading...
Vijay Deverakonda : శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. గుజరాతీ బ్లాక్‌బస్టర్‌ తెలుగులోకి రీమేక్‌?
శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. గుజరాతీ బ్లాక్‌బస్టర్‌ తెలుగులోకి రీమేక్‌?

Vijay Deverakonda : శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. గుజరాతీ బ్లాక్‌బస్టర్‌ తెలుగులోకి రీమేక్‌?

వ్రాసిన వారు Moogati Shabari
Sep 02, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

'లాలో కృష్ణ సదా సహాయతే'.. గుజరాతీ భాషలో కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారత్‌లో అత్యధిక లాభాలు అందించిన సినిమాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. అంతేకాదు.. గుజరాతీ భాషలో తొలిసారి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్రలో నిలిచింది.

వివరాలు

మైథలాజికల్ డ్రామాగా..

'లాలో కృష్ణ సదా సహాయతే' సినిమాలో పెద్దగా స్టార్‌ నటీనటులు లేరు. భారీ కమర్షియల్‌ హంగులు కూడా కనిపించవు.

కేవలం కథ, కంటెంట్‌, మౌత్‌టాక్‌తోనే ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా తప్పులు చేస్తూ జీవించే ఓ ఆటో డ్రైవర్‌ జీవితంలో శ్రీకృష్ణుడు ఎలాంటి మార్పు తీసుకొచ్చాడనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

మైథలాజికల్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి అంకిత్‌ సఖియా దర్శకత్వం వహించారు.

రీవా రాచ్‌, శృహాద్‌ గోస్వామి కీలక పాత్రల్లో నటించారు.

వివరాలు

శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ?

తాజాగా ఈ గుజరాతీ బ్లాక్‌బస్టర్‌ మూవీ తెలుగులోకి రీమేక్‌ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో భక్తి, మైథలాజికల్‌ సినిమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో 'లాలో కృష్ణ సదా సహాయతే' రీమేక్‌ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఓ యంగ్‌ హీరో ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్‌ దేవరకొండ నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

మోడ్రన్‌ శ్రీకృష్ణుడిగా ఆయన పాత్ర సినిమాకు ప్రధాన హైలైట్‌గా ఉండనుందని సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

కథ, కథనంలో చాలా మార్పులు..

గుజరాతీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగు రీమేక్‌లో కథ, కథనంలో చాలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని కమర్షియల్‌ హంగులు జోడించి సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే ఈ రీమేక్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ 'రణబలి', 'రౌడీ జనార్ధన' సినిమాలతో బిజీగా ఉన్నాడు.

వీటితో పాటు 'హాయ్‌ నాన్న' ఫేమ్‌ శౌర్యువ్‌ దర్శకత్వంలో ఓ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమాకు కూడా విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT