Vishal: విజయ్ కాంత్ మరణం.. బోరున విలపించిన విశాల్
ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ (Vijay Kant) మరణంతో కోలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణంతో సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున్న నివాళులర్పిస్తున్నారు. అయితే విజయ్ కాంత్ మృతితో హీరో విశాల్(Vishal)బోరున విలపించిన వీడియోను షేర్ చేశారు. కెప్టెన్ మనల్ని విడిచిపెట్టి మనకు శూన్యాన్ని మిగిల్చారని, ఆయన మరణవార్త విన్నాక తన కాళ్లు, చేతులు పని చేయడం లేదన్నారు. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు.