విజయ్ లియో సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. త్రిష హీరోయిన్ గా కనిపించిన లియో సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అటు థియేటర్లలో రిలీజ్ అయిందో లేదో లియో సినిమా ఓటీటీ విడుదలపై కొన్ని కథనాలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చేసాయి. లియో సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం. ఈ విషయాన్ని లియో సినిమా టైటిల్స్ పడే సమయంలో అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, లియో సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే విషయంపై కూడా అనేక వార్తలు వస్తున్నాయి.
నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్
థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీ లోకి లియో సినిమా వస్తుందని, అంటే నవంబర్ మూడవ వారంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే, లియో సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ ఛానల్ భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదలా ఉంచితే, లియో సినిమా మొదటి రోజు వసూళ్లు బీభత్సంగా ఉండబోతున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొదటిరోజు వసూళ్ళు 100కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన లియో సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.