Vijay Deverakonda-Rashmika: నెట్టింట వైరల్ అవుతున్న విజయ్-రష్మిక కొత్త ఫొటో
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాలతో అభిమానుల మనసు దోచిన విజయ్ దేవరకొండ-రష్మిక జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీరిద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారన్నది స్పష్టంగా తెలియకపోయినా, దాన్ని ఎవరో సీక్రెట్‌గా తీసి షేర్ చేసినట్లు సమాచారం. వీరి గురించి ప్రేమ గాసిప్స్ కొత్తేమీ కాదు. అయితే తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని విజయ్-రష్మికలు గతంలోనే వివరణ ఇచ్చారు. బాలీవుడ్ నటి అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రిలేషన్ షిప్ పై విజయ్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా తన మ్యూజిక్ ఆల్బమ్ 'సాహిబా' ప్రమోషన్స్ సందర్భంగా విజయ్ తన రిలేషన్షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సింగిల్ కాదని, రిలేషన్లో ఉన్నానని స్పష్టం చేయడంతో పాటు, కోస్టార్‌తో డేటింగ్ చేశానని చెప్పడం వైరల్ అయింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ VD12 షూటింగ్ పూర్తి దశకు చేరుకుంది. ఇక రష్మిక 'పుష్ప: ది రూల్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.