టీవీల్లోకి వచ్చేస్తున్న విజయ్ వారసుడు: ఎప్పుడు టెలిక్యాస్ట్ కానుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తలపతి విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షాన్ని కురిపించింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు నిర్మించారు. వీరిద్దరికీ తమ మొదట్టమొదటి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం.
తమిళంలో వారిసు అనే పేరుతో రూపొందిన ఈ చిత్రం, తెలుగులో వారసుడు అనే పేరుతో రిలీజైంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రానికి తెలుగులో అంతగా ఆదరణ దక్కలేదు.
అదలా ఉంచితే, ప్రస్తుతం వారసుడు సినిమా, తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం అవుతోంది.
Details
ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ కానుందంటే?
జెమిని టీవీలో జూన్ 25వ తేదీన సాయంత్రం 6గంటలకు వారసుడు సినిమా టెలిక్యాస్ట్ కానుంది. ఈ మేరకు అధికారికంగా సమాచారం వచ్చేసింది.
వారసుడు కథ ఏంటంటే:
ధనవంతుల కుటుంబంలో పుట్టిన హీరో, ఆ ఇంట్లో పరిస్థితులకు ఉండలేక ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఫ్యామిలీ బిజినెస్ లో సమస్యలొచ్చాయని, వాటిని తీర్చడానికి ఇంటికి వస్తాడు? ఆ సమస్యలను తీర్చాడా? ఆ సమస్యలు ఎవరు సృష్టించారనేదే సినిమా కథ.
రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాకు సంగీతాన్ని థమన్ సమకూర్చాడు. 300కోట్లకు పైగా వసూళ్లు అందుకున్న ఈ చిత్రం, తమిళ నాట ఈ సంవత్సరం అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.