LOADING...
Vijay Sethupathi: బిచ్చగాడు అవతారంలో విజయ్‌ సేతుపతి.. 'స్లమ్ డాగ్‌ - 33 టెంపుల్‌ రోడ్' ఫస్ట్ లుక్‌ రిలీజ్
బిచ్చగాడు అవతారంలో విజయ్‌ సేతుపతి.. 'స్లమ్ డాగ్‌ - 33 టెంపుల్‌ రోడ్' ఫస్ట్ లుక్‌ రిలీజ్

Vijay Sethupathi: బిచ్చగాడు అవతారంలో విజయ్‌ సేతుపతి.. 'స్లమ్ డాగ్‌ - 33 టెంపుల్‌ రోడ్' ఫస్ట్ లుక్‌ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ డైనమిక్‌ దర్శకుడు పూరి జగన్నాధ్‌, తమిళ విలక్షణ నటుడు 'మక్కల్‌ సెల్వన్‌' విజయ్‌ సేతుపతి కలిసి ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విజయ్‌ సేతుపతి ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమాకు 'స్లమ్‌డాగ్‌ - 33 టెంపుల్‌ రోడ్‌' అనే డిఫరెంట్‌, ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదలైన పోస్టర్‌లో విజయ్‌ సేతుపతి చేతిలో కత్తితో కనిపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.

Details

బిచ్చగాడి పాత్రలో విజయ్ సేతుపతి

ఈ చిత్రంలో ఆయన బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నారనే విషయం ప్రధాన హైలైట్‌గా మారింది. ఈ పాత్ర నేపథ్యంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, ఎక్స్‌ (X) వేదికగా హీరోయిన్‌ చార్మి కౌర్‌ ఓ ప్రత్యేక పోస్ట్‌ షేర్‌ చేశారు. అందులో విజయ్‌ సేతుపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన అంకితభావాన్ని దగ్గరగా చూడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. అలాగే '#SLUMDOG - 33 టెంపుల్‌ రోడ్‌' మనందరికీ చిరస్మరణీయ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని చార్మి తన పోస్ట్‌లో వెల్లడించారు.

Advertisement