
Vijay Sethupathi: అల్లుఅర్జున్-అట్లీ మూవీలో మరో స్టార్ హీరో?
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఓ స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఉండబోతుందన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆ గెస్ట్ ఎవరు అవుతారో తెలుసుకోవడానికి తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో సంబంధించి ప్రాజెక్ట్ అధికారిక సైట్‌ని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వెతుకుతున్నారు.
వివరాలు
విజయ్ సేతుపతి ఎంట్రీ?
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశముందని తెలుస్తోంది. 'పారలల్ యూనివర్స్' కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన రోల్ కోసం ఇప్పటికే ముంబైలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారని టాక్. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ కన్ఫర్మేషన్ వస్తే మాత్రం అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌తో పాటు సేతుపతి ఎంట్రీ డబుల్ సర్‌ప్రైజ్ అవుతుందనడంలో సందేహం లేదు.
వివరాలు
దీపికా పదుకొణె 100 డేస్ డెడికేషన్
ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రత్యేక లుక్‌లో కనిపించనున్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా వారియర్ స్టైల్ లుక్,అలాగే ప్రత్యేక ఆయుధాలను కూడా డిజైన్ చేశారని యూనిట్ సమాచారం. దీపికా ఈ సినిమా కోసం సుమారు 100 రోజులు సమయం కేటాయించారని తెలుస్తోంది. నవంబర్ నుంచి ఆమె రెగ్యులర్ షూట్‌లో పాల్గొనబోతున్నారు.అదే సమయంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ సినిమా షూట్‌తో ఈ షెడ్యూల్‌ని సమన్వయం చేసుకోనున్నారు. అంతేకాకుండా,ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్,జాన్వి కపూర్,రష్మిక మందన్నా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా రష్మిక విలన్ రోల్‌లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు, అల్లు అర్జున్ ఈ సినిమాలో నాలుగు వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నారని సినీ వర్గాల సమాచారం.
వివరాలు
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మెగా ప్రాజెక్ట్ షూటింగ్ 2026 సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. థియేటర్లలో మాత్రం 2027 రెండో భాగంలో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదిస్తుందనే అంచనాలు ఉన్నాయి.