
Vijay Sethupathi: విజయ్ సేతుపతి నిర్ణయంపై అభిమానుల హర్షం
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రీసెంట్ గా బాలీవుడ్ సినిమా "జవాన్" లో విలన్ గా నటించి మెప్పించాడు.
ప్రస్తుతం బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తో కలిసి మెర్రీ క్రిస్మస్ అంటూ మెయిన్ లీడ్ లో రాబోతున్నాడు.ఈ సినిమా జనవరి 12న,రిలీజ్ కాబోతోంది.
మరి ఇప్పుడు విజయ్ సేతుపతి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇటీవలి విజయ్ ఓ ఇంటర్వ్యూలో, తాను రానున్న రోజుల్లో విలన్ గా కానీ గెస్ట్ రోల్స్ లో గాని నటించకూడదని డిసైడ్ అయినట్టుగా తెలిపాడు.
Details
హిందీ, తమిళంలో రిలీజ్ అవనున్న మెర్రీ క్రిస్మస్
విజయ్ సేతుపతి తీసుకున్న ఈ డెసిషన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
విజయ్ సేతుపతి హీరోగా తన ట్రాక్ రికార్డు కంటే ఇతర సినిమాల్లో చేసిన పాత్రలకే మరింత గుర్తింపు వచ్చింది.
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన, మెర్రీ క్రిస్మస్ హిందీ, తమిళంలో రిలీజ్ అవ్వనుంది.
హిందీ వెర్షన్‌లో సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్ను ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు.
అదే సమయంలో, తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ నటిస్తున్నారు.ఈ సినిమాకి ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్టర్.