Ghaati : అనుష్క శెట్టి 'ఘాటి'లో తమిళ నటుడు విక్రమ్ ప్రభు.. ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "ఘాటి". ఈ చిత్రానికి "వేదం", "కంచె" వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు, జగర్లమూడి కృష్ణ (క్రిష్), దర్శకత్వం వహిస్తున్నాడు.
నాలుగేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఇటీవల పూర్తి చేసుకుంది.
అనుష్క పుట్టినరోజు సందర్భంలో విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కి మంచి స్పందన లభించింది.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రమోషన్లు ప్రారంభించిన చిత్ర యూనిట్,సినిమాలో కీలక పాత్రలను పరిచయం చేస్తోంది.
తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
వివరాలు
గిరిజన యువతిగా అనుష్క
విక్రమ్ ప్రభు బర్త్‌డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో విక్రమ్,"దేసి రాజు" అనే పాత్రలో కనిపించనున్నాడు.
అనుష్క ఈ సినిమాలో ఓ గిరిజన యువతిగా నటించబోతున్నట్లు తెలుస్తుంది.
భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల ఆధారంగా ఈ కథ తిరుగుతుంది.
ఒక బాధితురాలిగా ప్రారంభమైన అనుష్క పాత్ర, ఎలా క్రిమినల్‌గా మారి ఆ తర్వాత లెజెండ్‌గా పేరు పొందిందనే విషయాలను తెలియజేసే కథనమని చిత్రమేకర్స్ తెలిపారు.
"కొండపొలం" చిత్రానంతరం క్రిష్ దర్శకత్వంలో వస్తున్నందున ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు తెలుగుతో పాటు తమిళం,హిందీ,కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
Team #GHAATI roars with pride as we wish the incredible @iamVikramPrabhu garu a very Happy Birthday 🎉🔥
— UV Creations (@UV_Creations) January 15, 2025
Brace yourselves to feel the fire and witness him set the screen ablaze as the explosive #DesiRaju.
A Special Glimpse Video dropping today at 4:30 PM.#GHAATI on 18th April… pic.twitter.com/oKmZnJArTe