Gadadhari Hanuman: పాన్ ఇండియన్ భాషలలో 'గదాధారి హనుమాన్'.. నవంబర్ లో విడుదలకు సన్నాహాలు
కొత్త సినిమా కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తూ,కొత్త ప్రొడక్షన్ హౌస్ లతో కొత్త కాన్సెప్ట్ లను అందిస్తూ ఉంటుంది టాలీవుడ్. ఈ సారి, విరభ్ స్టూడియోస్ ఒక ప్రత్యేక కాన్సెప్ట్ తో రూపొందించిన సినిమా "గదాధారి హనుమాన్" ని పరిచయం చేస్తోంది. ఈ సినిమా, టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ కొల్లి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. "గదాధారి హనుమాన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఆడియన్స్ థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు కొత్త అనుభూతితో ఇంటికి వెళ్ళగలుగుతారు. ఈ సినిమా ఎంతో జాగ్రత్తగా రూపొందించబడింది," అని నిర్మాతలు బసవరాజు హురకదలి, రేణుక ప్రసాద్ కే.ఆర్ చెప్పారు.
టైటిల్ చివరలో హనుమాన్ తోక
"ఈ సినిమాని ఒక డివైన్ టచ్ తో అద్భుతంగా రూపొందించాం.ఆడియన్స్ మా సినిమా చూసి కల్కి, హను-మాన్ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ ను మాకు ఇస్తారు అని మాకు పూర్తి నమ్మకం ఉంది," అని దర్శకుడు రోహిత్ కొల్లి తెలిపారు. "గదాధారి హనుమాన్" టైటిల్ గమనించగానే,హనుమాన్ విజయ సింబల్ లతో కూడిన జెండా, టైటిల్ చివరలో హనుమాన్ తోక కూడా జోడించారు. ఇది రావణ దహన సన్నివేశాలతో కూడినదిగా అనిపిస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను త్వరలో తెలియచేస్తామని "గదాధారి హనుమాన్" టీం పేర్కొంది. ప్రస్తుతం,ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో పూర్తి చేసి నవంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.