Page Loader
Bhairavam: ఓటీటీలోకి వచ్చేసిన 'భైరవం'.. ఎక్కడంటే? 
ఓటీటీలోకి వచ్చేసిన 'భైరవం'.. ఎక్కడంటే?

Bhairavam: ఓటీటీలోకి వచ్చేసిన 'భైరవం'.. ఎక్కడంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ZEE5 తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకునే తెలుగు ఒరిజినల్ సిరీస్‌ 'విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌'ను అందించిది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సిరీస్ జూన్ 26న ప్రీమియర్ కావడంతో మొదటి వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటింది. దీంతో ఈ వెబ్ సిరీస్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కథన శైలిలోని థ్రిల్, మిస్టరీలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ గొప్ప విజయాన్ని పురస్కరించుకుని, ZEE5 వారు మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇటీవల భారీ విజయాన్ని నమోదు చేసిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'భైరవం'ను త్వరలోనే ZEE5 లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌లో 'విరాటపాలెం' సిరీస్ ట్రెండింగ్‌లో టాప్‌ స్థానంలో కొనసాగుతోంది.

వివరాలు 

పదేళ్ల పాటు ఆ ఊరిలో పెళ్లిళ్లు అనేవి జరగవు 

ఈ సిరీస్‌ను కృష్ణ పోలూరు దర్శకత్వం వహించగా, కెవి శ్రీరామ్ నిర్మించారు. ప్రముఖ నటులు అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ముఖ్య పాత్రల్లో నటించారు. కథ 1980ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని విరాటపాలెం అనే ఊరిని ఆధారంగా చేసుకుని సాగుతుంది. ఈ గ్రామంలో ప్రతి పెళ్లి కూతురు పెళ్లి రోజు మరణించడం ఒక శాపంగా మారింది. ఈ అనూహ్య సంఘటనలతో గ్రామస్థులంతా భయాందోళనలతో జీవిస్తున్నారు. దాదాపు పదేళ్ల పాటు ఆ ఊరిలో పెళ్లిళ్లు అనేవి జరగవు . మూఢనమ్మకాలు, భయాలతో కంగారుపడుతున్న పరిస్థితుల్లో అక్కడికి పోలీస్ కానిస్టేబుల్ మీనా (అభిజ్ఞ వూతలూరు) వస్తుంది.

వివరాలు 

'విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌' సిరీస్‌కు విమర్శకుల ప్రశంసలు

మీనా ఆ గ్రామంలోని ప్రజలను ప్రశ్నించడం ప్రారంభిస్తుంది. గ్రామంలోని రహస్యాలను ఆమె ఎలా తెలుసుకుంది? ఇది నిజంగానే శాపమా? లేక వేరెవరో చేయిస్తున్న హత్యల సరళేమా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగిస్తాయి. ఇవన్నీ థ్రిల్‌తో కలగలిపి సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాయి. అంతే కాదు, 'విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌' సిరీస్‌కు విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. కథ, నటన, దృశ్యాల మాయాజాలంతో ఈ సిరీస్ ప్రేక్షకులను థ్రిల్‌లోకి తీసుకెళుతోంది.