
వంద కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష: ఈ ఏడాది నాలుగవ సినిమాగా రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం, బాక్సాఫీస్ దగ్గర 100కోట్లు కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తన సోషల్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
సాయి ధరమ్ తేజ్ కెరీర్లో 100కోట్ల వసూళ్ళను సాధించిన మొట్టమొదటి చిత్రంగా విరూపాక్ష నిలిచింది.
ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, దసరా చిత్రాలు వందకోట్ల క్లబ్ లో చేరాయి. ఆ లిస్టులోకి ఇప్పుడు విరూపాక్ష ఎంటర్ అయ్యింది.
పాన్ ఇండియా మూవీగా హిందీ, మలయాళం, తమిళం, భాషల్లో కూడా రిలీజ్ అయింది విరూపాక్ష. కానీ, తెలుగులో కనిపించిన వసూళ్ళ సునామీ ఇతర భాషల్లో కనిపించలేదు.
Details
విరూపాక్ష సినిమాలో కీలకంగా సంయుక్తా మీనన్ పాత్ర
విరూపాక్ష కథ ఏంటంటే:
రుద్రవనం అనే ఊరిలో వరుసగా మనుషులు చచ్చిపోతుంటారు. దానికి కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి సాయిధరమ్ తేజ్ పాత్ర ప్రయత్నం చేస్తుంది.
ఈ ప్రాసెస్ లో రహస్యం గురించి అతి భయంకరమైన నిజం తెలుసుకుంటాడు. అదేంటో తెలుసుకోవాలంటే విరూపాక్ష చిత్రం చూడాల్సిందే.
ఇందులో హీరోయిన్ గా నటించిన సంయుక్తా మీనన్, నెగిటివ్ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది. ఇప్పటివరకు సంయుక్త మీనన్ తెలుగులో చేసిన పాత్రలన్నింటిలోకి విరూపాక్ష సినిమాలో చేసిన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది.
కార్తీక్ దండు దర్శకత్వం వహించిన విరూపాక్ష సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.