Page Loader
విరూపాక్ష దర్శకుడికి ఖతర్నాక్ గిఫ్ట్ అందించిన నిర్మాతలు 
విరూపాక్ష దర్శకుడికి బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన నిర్మాతలు

విరూపాక్ష దర్శకుడికి ఖతర్నాక్ గిఫ్ట్ అందించిన నిర్మాతలు 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 28, 2023
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు చేసిన చిత్రంగా నిలవడంతో పాటు ఈ ఏడాది వందకోట్ల వసూళ్ళు సాధించిన చిత్రాల లిస్టులో చేరిపోయింది. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన విరూపాక్ష సినిమాను కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసారు. తాజాగా విరూపాక్ష దర్శకుడికి అదిరిపోయే బహుమతిని నిర్మాతలు అందజేసారు. థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి ఎంటర్ టైన్ చేసిన దర్శకుడికి బెంజ్ కారును బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని తన సోషల్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు కార్తీక్ దండు. విరూపాక్ష సినిమాలో హీరోయిన్ గా సంయుక్తా మీనన్ కనిపించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాతలు