విరూపాక్ష: ఇతర భాషల్లో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్
ఈ వార్తాకథనం ఏంటి
సాయి ధరమ్ తేజ్ హీరోగా రిలీజైన విరూపాక్ష మూవీ, బాక్సాఫీసు దగ్గర తన సత్తా చూపిస్తోంది. ఊపిరి బిగపట్టేంత సస్పెన్స్ తో రూపొందించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటున్నారు.
నిజానికి విరూపాక్ష సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ చివర్లో ఒక్క తెలుగులో మాత్రమే రిలీజ్ చేసారు.
తాజాగా విరూపాక్ష సినిమా పాన్ ఇండీయా రిలీజ్ పై అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటించిన సాయి ధరమ్ తేజ్, ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు.
అన్ని భాషల్లో ఎందుకు రిలీజ్ చేయలేదని ఒక నెటిజన్ ప్రశ్న అడగడంతో, ఇంటగెలిచి రచ్చ గెలవాలని ఆగామని, త్వరలో అని భాషల్లో విడుదల అవుతుందని అన్నాడు.
Details
50కోట్లకు చేరువలో విరూపాక్ష
అన్ని భాషల్లో సినిమా విడుదల అవుతుందని అన్నాడే కానీ ఏ రోజున రిలీజ్ ఉంటుందనేది చెప్పలేదు సాయి ధరమ్ తేజ్.
ఏదేమైనా తెలుగులో దూసుకుపోతున్న విరూపాక్ష మూవీ, ఇతర భాషల్లోనూ తన సత్తా చూపిస్తుందని సినీ అభిమానులు నమ్ముతున్నారు.
విరూపాక్ష సినిమాకు గడిచిన మూడు రోజుల్లో 44కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు ఉత్తర అమెరికాలోనూ విరూపాక్ష దూసుకుపోతుంది.
తాజా సమాచారం ప్రకారం 8లక్షల 50వేల డాలర్ల వసూళ్ళను సాధించినట్లు తెలుస్తోంది.
విరూపాక్ష సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపించింది. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకు కార్తిక్ దండు దర్శకత్వం వహించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విరూపాక్ష పాన్ ఇండియా రిలీజ్ పై సాయి తేజ్ మాట
ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం అని ఆగాం అతి త్వరలో అన్ని భాషల్లో విడుదల #Virupaksha
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 24, 2023