NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ: సాయి ధరమ్ తేజ్ భయపెట్టాడా? 
    విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ: సాయి ధరమ్ తేజ్ భయపెట్టాడా? 
    సినిమా

    విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ: సాయి ధరమ్ తేజ్ భయపెట్టాడా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    April 21, 2023 | 10:04 am 1 నిమి చదవండి
    విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ: సాయి ధరమ్ తేజ్ భయపెట్టాడా? 
    విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ

    సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో సరికొత్త జోనర్ లో తెరకెక్కిన విరూపాక్ష చిత్రం ఈరోజు రిలీజైంది. ఆల్రెడీ అమెరికాలో ప్రిమియర్స్ పడటంతో టాక్ బయటకు వచ్చేసింది. ఇండియాలోనూ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందనేది ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. సినిమా ఎలా ఉందంటే: సినిమా మొదలు కావడం చాలా ఆసక్తిగా జరిగిందని అంటున్నారు. ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు ఉన్నాయట. డైరెక్టుగా పాయింట్ లోకి దిగినప్పటికీ అక్కడ వచ్చే కామెడీ సీన్లు నవ్వు తెప్పిస్తాయని అంటున్నారు. సంయుక్తా మీనన్ గ్లామర్ షో ఫస్టాఫ్ లో ఉంటుందనీ, సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మధ్య వచ్చే లవ్ సీన్స్ సరిగ్గా పండలేదని చెబుతున్నారు.

    సెకండాఫ్ లో సాయి ధరమ్ తేజ్ పాత్రలో కనిపించే మార్పు 

    ఫస్టాఫ్ డీసెంట్ గా ఉందని, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని కామెంట్లు పెడుతున్నారు. ఇక సెకండాఫ్ మాత్రం మరో లెవెల్లో ఉందని, ఆకట్టుకునే కథనంతో, ఆసక్తికరమైన కథతో, సీటు అంచు మీద కూర్చునేలా చేస్తుందని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ నుండి సెకండాఫ్ కు వచ్చేసరికి సాయి ధరమ్ తేజ్ పాత్రలో చాలా మార్పు కనిపిస్తుందని. ఆ మార్పును సాయి తేజ్, చాలా బాగా చేసారని చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మాత్రం పీక్స్ లో ఉందనీ, సౌండ్ కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు. దర్శకుడు కార్తీక్ దండు, సినిమాని చాలా తెరకెక్కించాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ బాగా భయపెట్టాడని, ట్విస్టులు అదిరిపోయాయని చెప్పుకుంటున్నారు.

    Twitter Post

    Nice 2nd half. Highly engaging screenplay. Interesting story. It's been quite some time since we saw this kind of story in telugu films. Good watch #Virupaksha https://t.co/oLy3E7Lw6m

    — Puri stan (@purijagan_stan) April 21, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సాయి ధరమ్ తేజ్
    తెలుగు సినిమా

    సాయి ధరమ్ తేజ్

    విరూపాక్ష చిత్రానికి యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ సినిమా
    విరూపాక్ష ట్రైలర్: రహస్యాన్ని కనుక్కునే పనిలో రక్తం చిందించిన సాయి ధరమ్ తేజ్  తెలుగు సినిమా
    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్

    తెలుగు సినిమా

    బాలీవుడ్ ను పొగుడుతూ దక్షిణాది సినిమాపై విరుచుకుపడ్డ హీరోయిన్ తాప్సీ  సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  అల్లు అర్జున్
    #OG: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పక్కన గ్యాంగ్ లీడర్ భామ ఫిక్స్  పవన్ కళ్యాణ్
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ  ప్రభాస్
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023