LOADING...
Wedding of virosh: 'విరోష్' వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి మొదలు!
'విరోష్' వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి మొదలు!

Wedding of virosh: 'విరోష్' వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి మొదలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణాలు మరికొన్ని గంటల్లోనే రానున్నాయి. హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పుర్ వేదికగా వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు, బంధువులు, స్నేహితులు ఉదయ్‌పుర్ చేరుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విజయ్ స్విమ్మింగ్ పూల్ వద్ద తీసుకున్న ఫొటోను షేర్ చేయగా, రష్మిక డైనింగ్ టేబుల్‌పై గ్రీన్ థీమ్‌తో అలంకరించిన డిన్నర్ మెనూ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ మెనూలో 'విరోష్' అని రాసి ఉండడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

Details

100 మంది అతిథులకే మాత్రమే అహ్వానం

వివాహ వేడుకలు నేటి నుంచే ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు సంగీత్, మెహందీ కార్యక్రమాలు నిర్వహించనుండగా, రేపు హల్దీ వేడుక జరగనుంది. ఫిబ్రవరి 26న ప్రధాన వివాహం జరుగుతుందని సమాచారం. ఉదయ్‌పుర్‌లోని ఉదయపూర్ లోని ITC మెమెంటోలు ఈ వేడుకలకు వేదికగా నిలవనుందని తెలుస్తోంది. సన్నిహిత వర్గాల ప్రకారం, ఈ పెళ్లికి కేవలం 100 మంది అతిథులకే ఆహ్వానం అందిందని తెలుస్తోంది. మొత్తానికి, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ స్టార్ జంట పెళ్లి వేడుకలు ఘనంగా సాగనున్నాయి.

Advertisement