Page Loader
విరూపాక్ష కలెక్షన్లు: సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం 
50కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష

విరూపాక్ష కలెక్షన్లు: సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 25, 2023
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సినిమా రిలీజైనా నాలుగు రోజుల్లోనే 50కోట్ల వసూళ్ళను సాధించింది. ఈ మేరకు ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ, శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర వెల్లడించింది. నాలుగు రోజుల్లోనే 50కోట్ల క్లబ్ లో చేరిపోయాడు సాయి ధరమ్ తేజ్. అంతేకాదు అతని కెరీర్లో అత్యధిక వసూళ్ళు సాధించాడు. ఓవర్సీస్ లోనూ సైతం విరూపాక్ష వసూళ్ళు బాగున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు మూడుకోట్ల వసూళ్ళు వచ్చాయని సమాచారం. పాన్ ఇండియా విడుదలకు సిద్ధమైన విరూపాక్ష ప్రస్తుతం తెలుగులో మాత్రమే రిలీజైంది. హిందీ, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో మే 5వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ జరుగుతుందని సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

50కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష