Page Loader
AG 3 : విదేశీ విద్యార్థుల నేపథ్యంలో 'VISA'.. గల్లా అశోక్ ఫస్ట్ లుక్ విడుదల!
విదేశీ విద్యార్థుల నేపథ్యంలో 'VISA'.. గల్లా అశోక్ ఫస్ట్ లుక్ విడుదల!

AG 3 : విదేశీ విద్యార్థుల నేపథ్యంలో 'VISA'.. గల్లా అశోక్ ఫస్ట్ లుక్ విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ తన నటనా ప్రయాణాన్ని కొత్త కోణంలో కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. తొలి సినిమా హీరో ద్వారా మంచి ప్రశంసలు అందుకున్నా, రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. దీనితో తన ట్రాక్‌ను మార్చాలని నిర్ణయించుకున్న అశోక్ గల్లా, ఇప్పుడు యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో ఓ వినూత్న చిత్రాన్ని చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం కథా నేపథ్యం అమెరికాలోని భారతీయ విద్యార్థుల జీవితాలపై ఆధారపడినది. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కలలు,కష్టాలు, సందిగ్ధతలు, స్నేహాలు, ప్రేమ ఇలా ఎన్నో మానవీయ భావోద్వేగాలను చూపించే ప్రయత్నమిది. టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

Details

ఈ ఏడాదే రిలీజయ్యే అవకాశం

సినిమాకు 'వీసా - వింటారా సరదాగా!' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పోస్టర్‌లో అశోక్ గల్లా స్టైలిష్, కూల్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. యువతను ఆకర్షించేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా నూతన దర్శకుడు ఉద్భవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రధాన పాత్రల్లో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు. టీజర్‌ను జూలై 13 శనివారం ఉదయం 10:53 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సాంకేతిక బృందం, ఇతర నటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో నిరాశ ఎదురైన గల్లా అశోక్, ఈసారి సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథతో ప్రేక్షకులను మెప్పించాలని భావిస్తున్నాడు.