Loading...
Vishal: ప్రజాసేవ కోసం మంచి పేరును వినియోగిస్తా.. రాజకీయ ప్రవేశంపై విశాల్ కీలక వ్యాఖ్యలు
ప్రజాసేవ కోసం మంచి పేరును వినియోగిస్తా.. రాజకీయ ప్రవేశంపై విశాల్ కీలక వ్యాఖ్యలు

Vishal: ప్రజాసేవ కోసం మంచి పేరును వినియోగిస్తా.. రాజకీయ ప్రవేశంపై విశాల్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 28, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ హీరో ధనుష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారానికి ఊతమిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో నటుడు విశాల్ చేసిన తాజా వ్యాఖ్యలు కూడా రాజకీయ ప్రవేశంపై కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటివరకు సినీ రంగంలో సంపాదించిన గుర్తింపు, ప్రజాదరణను ఇకపై ప్రజాసేవకు ఉపయోగించాలని తన ఆకాంక్ష అని ఆయన వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ఓ బహిరంగ సభలో విశాల్ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా నటుడిగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను పొందానని, అభిమానులు తనపై చూపిన విశ్వాసానికి ప్రతిఫలంగా సమాజానికి ఏదైనా చేయాలనే బాధ్యత తనపై ఉందని చెప్పారు.

వివరాలు

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం..

ఇకపై తన జీవన ప్రయాణం కొత్త దిశగా సాగుతుందని, ఎలాంటి అడ్డదారులు ఆశ్రయించకుండా నిజాయతీతో ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఆ మార్గంలో ముందుకు సాగుతూ ప్రతి రంగంలో ప్రజలకు అండగా నిలిచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సంకేతాలుగా భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు

రాజకీయాల్లోకి వస్తారంటూ వార్తలు..

కాగా, 2024లోనే విశాల్ రాజకీయాల్లోకి వస్తారంటూ వార్తలు వచ్చిన సమయంలో కూడా ఆయన ఈ అంశంపై స్పందించారు.

తమిళనాడు ప్రజలు తనను నటుడిగానే కాకుండా సామాజిక సేవకుడిగానూ ఆదరిస్తున్నారని, వారి ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

తన అభిమాన సంఘాన్ని కేవలం అభిమాన కార్యకలాపాలకే పరిమితం చేయకుండా ప్రజా సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా భాగస్వామ్యం చేస్తానని చెప్పారు.

ప్రస్తుతం తన సేవా కార్యక్రమాలకు రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేసిన ఆయన, భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే ప్రజల కోసం నిలబడే విషయంలో మాత్రం వెనుకడుగు వేయబోనని వెల్లడించారు.

ADVERTISEMENT