Vishal: వణుకుతూ కనిపించిన విశాల్.. హెల్త్ రిపోర్టును వెల్లడించిన టీమ్ సభ్యులు
ఈ వార్తాకథనం ఏంటి
హీరో విశాల్ ఆరోగ్యంపై ఆదివారం సాయంత్రం నుంచి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆయనకు అనారోగ్య సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. 'మదగజరాజ' ప్రెస్‌మీట్‌లో వణుకుతూ కనిపించిన విశాల్‌ను చూసి అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన టీమ్ అధికారిక హెల్త్ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది.
అందులో, విశాల్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, వైద్యులు ఆయనకు బెడ్ రెస్ట్ సూచించారని పేర్కొంది.
విశాల్ హీరోగా నటించిన 'మదగజరాజ' సినిమా 12 సంవత్సరాల అనంతరం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా కోసం ఆదివారం చెన్నైలో ఈవెంట్ నిర్వహించారు.
Details
త్వరగా కోలుకోవాలని నెటిజన్ల పోస్టులు
ఈ కార్యక్రమంలో విశాల్, ఖుష్బూ, సుందర్.సి, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ పాల్గొన్నారు.
అయితే విశాల్ సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణుకుతూ కనిపించారు. అదే సమయంలో యాంకర్ ఈ విషయాన్ని పేర్కొంది.
ఇదే నేపథ్యంలో, స్థానిక, రియు ఆంగ్ల పత్రికలలో ఈ ఆరోగ్యం సంబంధిత వార్తలు ప్రచారం పొందాయి.
విశాల్‌కు 'గెట్ వెల్ సూన్' అని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేశారు.