
Vishwambhara : 'విశ్వంభర' వీఎఫ్‌ఎక్స్‌కి రూ.75 కోట్లు ఖర్చు.. అభిమానుల్లో భారీ అంచనాలు
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర స్పీడ్‌గా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమా మీద వరుస అప్డేట్లు వస్తుండటంతో ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ పనులు టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి.
విశ్వంభర కోసం నిర్మాతలు వీఎఫ్‌ఎక్స్ ఏకంగా రూ. 75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్.
అంతేకాదు, ఈ గ్రాఫిక్స్ పనులకు హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ప్రఖ్యాత వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో డీల్ కుదిరిందని తెలుస్తోంది.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీ రోల్ పోషించనున్నాయి.
Details
జూలైలో విడుదల చేసేందుకు ప్లాన్
వీఎఫ్‌ఎక్స్ ఖర్చు చూస్తే, ఈ సినిమా మరింత విజువల్ స్పెక్టాకిల్‌గా మారతుందన్న అంచనాలు కలుగుతున్నాయి.
నిజంగా సినిమా వాస్తవికత కంటే గ్రాఫిక్స్ మీదే ఎక్కువగా ఆధారపడినట్టే అనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా చాలా కాలం కిందటే రిలీజ్ కావాల్సి ఉండగా, వీఎఫ్‌ఎక్స్ పనులే ఆలస్యానికి ప్రధాన కారణంగా మారాయి.
ఇటీవలే రామ రామ అనే పాటను విడుదల చేసిన చిత్రబృందం, త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఈ స్థాయి గ్రాఫిక్స్‌తో, ఈ సారి చిరంజీవి నుంచి అసలు ఎలాంటి విజువల్ మ్యాజిక్ చూడబోతున్నామో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.