NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో
    తదుపరి వార్తా కథనం
    విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో
    విశ్వక్ సేన్ పుట్టినరోజు

    విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 29, 2023
    08:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశ్వక్ సేన్.. తెలుగు సినిమా హీరో. ఈయన మాట్లాడితే కాన్ఫిడెన్స్ కే కాన్ఫిడెన్స్ పుట్టుకొస్తుంది. కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దంలాంటి హీరో, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

    హైదరాబాద్ లో పుట్టి పెరిగిన విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. ఏవో కారణాల వల్ల పేరు మార్చుకుని వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా మారాడు.

    తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాలోని విశ్వక్ సేన్ పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాలో నటనకు సంతోషం ఫిలిమ్ అవార్డ్ అందుకున్నాడు.

    ఆ తర్వాతే ఫలక్ నుమా దాస్ విడుదలైంది. విశ్వక్ కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పిన చిత్రం ఇది. యువతలో క్రేజ్ నీ, మాస్ లో ఫాలోయింగ్ నీ తెచ్చి పెట్టింది ఫలక్ నుమా దాస్.

    విశ్వక్ సేన్

    విశ్వక్ సేన్ కెరీర్లోని విభిన్నమైన చిత్రాలు

    ఫలక్ నుమా దాస్ చిత్రం, విశ్వక్ లోని దర్శకుడిని పరిచయం చేసింది. ఈ హీరో ఇంత బాగా డైరెక్షన్ చేయగలడా అని అందరూ షాకయ్యారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా తనే కావడం విశేషం.

    విశ్వక్ సేన్ నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సినిమాల్లో హిట్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాలు చేరిపోతాయి.

    హిట్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎంత బాగా చేసాడో, అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా వంటి చిత్రాల్లో రొమాంటిక్ హీరోగా అంత బాగా కనిపించాడు.

    తాజాగా దాస్ కా ధమ్కీ అంటూ మరోసారి డైరెక్షన్ తో వచ్చాడు. ఈ సినిమా మంచి వసూళ్ళు సాధిస్తూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    విశ్వక్ సేన్

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    తెలుగు సినిమా

    హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కొడుకు, ఫస్ట్ లుక్ రిలీజ్ సినిమా
    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్: విశ్వక్ సేన్ సినికాకు ఆస్కార్ క్రేజ్ సినిమా రిలీజ్
    భళ్ళాలదేవుడు రానాకు కంటి చూపు సమస్య, కిడ్నీ మార్పిడి, అనారోగ్య విషయాలు పంచుకున్న రానా సినిమా
    విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేయనున్న డీజే టిల్లు భామ సినిమా

    విశ్వక్ సేన్

    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025