Page Loader
Laila Third Single: 'లైలా' నుంచి థ‌ర్డ్ సింగిల్ రిలీజ్.. కోయ్ కోయ్ కోడ్ని కోయ్..

Laila Third Single: 'లైలా' నుంచి థ‌ర్డ్ సింగిల్ రిలీజ్.. కోయ్ కోయ్ కోడ్ని కోయ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
08:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'లైలా'. ఈ చిత్రానికి రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించగా, సాహు గార్లపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ సహా రెండు పాటలు విడుదల కాగా, మంచి స్పందనతో దూసుకుపోతున్నాయి.

వివరాలు 

 'ఓహో రత్తమ్మా' మూడో సింగిల్‌ను విడుదల 

తాజాగా, చిత్రబృందం 'ఓహో రత్తమ్మా' అనే మూడో సింగిల్‌ను విడుదల చేసింది. ఈ పాటలో ఇటీవల వైరల్‌ అయిన "కోయ్ కోయ్ కోడ్ని కోయ్" అనే లిరిక్స్‌ను ఉపయోగించారు. పెంచల్‌ దాస్‌ లిరిక్స్‌ అందించడంతో పాటు ఆలపించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే, ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ 'బార్బర్‌ సోన్‌', 'లైలా' అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్