విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ జంటగా బూ మూవీ: డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, నివేతా పేతురాజ్ నటించిన బూ సినిమా గురించి చాలామందికి తెలియదు. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చేస్తోంది.
థియేటర్లలో రిలీజ్ కాకుండా డైరెక్టుగా ఓటీటీ బాట పట్టిన ఈ సినిమా, హార్రర్ జోనర్ లో తెరకెక్కింది.
ప్రస్తుతం ఈ సినిమా, జియో సినిమా ఓటీటీ ఛానల్ లో మే 27వ తేదీ నుండి అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని వెల్లడి చేస్తూ బూ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.
ఒకానొక ఇంట్లో కనిపించిన దయ్యాల పుస్తకాన్ని నలుగురు స్నేహితులు చదువుతారు. ఆ ఇంట్లో దయ్యం ఆనవాళ్ళు వాళ్ళకు కనిపిస్తాయి. ఆ దయ్యం నుండి వాళ్ళెలా తప్పించుకున్నారనేదే కథ.
Details
తమిళంలోనూ రిలీజ్ అవుతున్న బూ
బూ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, నివేతాలతో పాటు మంజిమా మోహన్, మేఘా ఆకాష్, రెబా జాన్, విద్యుల్లేఖ రామన్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. కీలక పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు.
తెలుగు, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని స్రవంతి రామ్ క్రియేషన్స్, శ్రీ షిరిడి మూవీస్ బ్యానర్లలో జ్యోతి దేశ్ పాండే, రామాంజనేయులు, జవ్వాజి, రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఏ ఎల్ విజయ్ గతంలో, తలైవి, మదరాసుపట్టణం, దైవ తిరుమగల్, విజయ్ తలైవా చిత్రాలను తెరకెక్కించాడు.
అదలా ఉంచితే విశ్వక్ సేన్ ప్రస్తుతం తన 11వ సినిమాలో నటిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో ఈ మూవీ రూపొందుతోంది.