థియేటర్స్ లో ఇచ్చిపడేసేందుకు కాస్త లేట్ అవుతుందంటున్న విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు అలరించడానికి ఎప్పుడూ ముందుంటాడు. అదేం విచిత్రమో గానీ విశ్వక్ సేన్ విభిన్నంగా కనిపించిన చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయవంతం అవ్వలేదు. అదలా ఉంచితే ప్రస్తుతం విశ్వక్ సేన్, దాస్ కా ధమ్కీ చిత్రంలో మళ్ళీ తనకు పేరు తెచ్చిన మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. నివేతా పేతురాజ్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి ఆల్రెడీ ట్రైలర్ 1.0 రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమా మీద అందరికీ ఆసక్తి పెరిగింది. ఫిబ్రవరి 17వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసారు. కానీ ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కావట్లేదు.
సీజీ వర్క్ మిగిలిపోయిందంటున్న విశ్వక్ సేన్
పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ఒక పాట, డబ్బింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందట. అలాగే గ్రాఫిక్స్ పనులు మిగిలి ఉండడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నామని కొత్త రిలీజ్ తేదీతో మరికొద్ది రోజుల్లో మళ్ళీ వస్తామని విశ్వక్ సేన్ ప్రకటించాడు. ధమ్కీ సినిమాను వాణ్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లియోని జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. అటు హీరోగా, ప్రొడ్యూసర్ గా ఉన్న విశ్వక్ సేన్ ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.