NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది
    తదుపరి వార్తా కథనం
    త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది
    విశ్వక్ సేన్ 11వ సినిమా ప్రకటన

    త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 29, 2023
    04:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ రోజు 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ నుండి కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. అది కూడా త్రివిక్రమ్ బ్యానర్ లో కావడం విశేషం.

    అవును, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అనే పేరుతో, త్రివిక్రమ్ సొంత బ్యానర్ ని మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ కు అధినేత్రిగా త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఉన్నారు.

    ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా విశ్వక్ సేన్ తో సినిమాను మొదలెట్టాయి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడని వెల్లడించారు. ఈ మేరకు చిన్నపాటి వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియోలో సినిమాకు సంబంధించిన థీమ్ కనిపిస్తోంది.

    విశ్వక్ సేన్

    విశ్వక్ సేన్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం

    ఈ వీడియోలో ఆసక్తికరమైన కొటేషన్ కనిపించింది. సమాజంలోని నిబంధనలను ధిక్కరించినపుడు తప్పొప్పులు ఉండవు అంటూ చూపించారు.

    వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి, యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారనేది ఇంకా వెల్లడి చేయలేదు.

    ఈ చిత్ర షూటింగ్, మరికొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుందని తెలియజేసారు.

    అటు దాస్ కా ధమ్కీ చిత్రం, థియేటర్లలో ఉండగానే కొత్త సినిమాను మొదలెట్టాడు విశ్వక్ సేన్. ఇక దాస్ కా ధమ్కీ విషయానికి వస్తే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

    రిలీజైన మొదట్లో కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ, తర్వాత బాగా తగ్గినట్లుగా చెప్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విశ్వక్ సేన్ 11వ సినిమా ప్రకటన

    Ichipadedham 🤙

    In a world that defies Social Norms, There's no black white! Only Grey 😎@thisisysr #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri #Innamuri88 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/Kws6mbLXFX

    — VishwakSen (@VishwakSenActor) March 29, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశ్వక్ సేన్

    తాజా

    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్

    విశ్వక్ సేన్

    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ
    విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025