Page Loader
Vishwak Sen : లైలాగా విశ్వక్సేన్.. VS12 టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో.. 

Vishwak Sen : లైలాగా విశ్వక్సేన్.. VS12 టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 29, 2024
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేడు టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పుట్టినరోజు.విశ్వక్సేన్ పుట్టినరోజును పురస్కరించుకుని షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసారు. ఈ సినిమాకి 'లైలా' అనే టైటిల్ ని పెట్టారు. మూవీలో లైలా మరెవరో కాదు విశ్వక్ సేనే. ఈ మూవీలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నారట.ఈ చిత్రానికి బట్టల రామస్వామి బయోపిక్‌కి దర్శకత్వం వహించిన రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వక్సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై,సాహు గారపాటి నిర్మిస్తున్నఈ సినిమాకి వాసుదేవ మూర్తి రచయిత. తనిష్క్ బాగ్చి మ్యూజిక్ డైరెక్టర్,రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టి పూర్తి చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

షైన్ స్క్రీన్స్ సంస్థ చేసిన ట్వీట్