Page Loader
Laila Teaser: 'మనకు తెల్లగా చేసుడే కాదు. తోలు తీసుడు కూడా వచ్చు'.. విశ్వక్ సేన్ లైలా టీజ‌ర్ వ‌చ్చేసింది..

Laila Teaser: 'మనకు తెల్లగా చేసుడే కాదు. తోలు తీసుడు కూడా వచ్చు'.. విశ్వక్ సేన్ లైలా టీజ‌ర్ వ‌చ్చేసింది..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యమా వేగంతో ముందుకు దూసుకెళ్తున్నారు. వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం లైలా.ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం, అంటే ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. తాజాగా,ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తున్నారు.రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. షైన్ స్క్రీన్ పిక్చర్స్,ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రెజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించగా,బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.వాసుదేవ మూర్తి స్క్రీన్‌ప్లే అందించగా,రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్