LOADING...
Vishwambhara : మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.. 'విశ్వంభర' రిలీజ్‌పై క్లారిటీ ఎప్పుడు?
మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.. 'విశ్వంభర' రిలీజ్‌పై క్లారిటీ ఎప్పుడు?

Vishwambhara : మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.. 'విశ్వంభర' రిలీజ్‌పై క్లారిటీ ఎప్పుడు?

వ్రాసిన వారు Moogati Shabari
May 27, 2026
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ప్రారంభంలోనే 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి భారీ విజయాన్ని అందుకున్నారు. అదే ఉత్సాహంతో తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ దర్శకత్వంలో ప్రారంభించారు. ఇటీవల ఘనంగా ప్రారంభమైన ఈ మూవీ, మరుసటి రోజే షూటింగ్‌ను మొదలుపెట్టి ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే చాలా కాలం క్రితమే ప్రారంభమైన మెగాస్టార్ 'విశ్వంభర' పరిస్థితిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. చెప్పాలంటే, ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని మెగా అభిమానులు క్రమంగా మర్చిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

వివరాలు

యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న మూవీ..

'బింబిసార' దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ గ్రాఫిక్స్ పనులు ఆలస్యమవుతుండటంతో గత కొంతకాలంగా ఈ సినిమా గురించి ఎలాంటి చర్చ కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ ముగియబోతున్నా విడుదల తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

వివరాలు

మెగా ఫ్యాన్స్ నిరాశ..

అంతేకాదు, సినిమా రిలీజ్ ఎప్పుడు? టీజర్ లేదా పాటల అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయి? అనే విషయాలపై కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో సినిమాపై ఉన్న హైప్ కూడా క్రమంగా తగ్గిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆలస్యం పూర్తిగా వీఎఫ్ఎక్స్ పనుల కారణంగానే జరుగుతోందా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి 'విశ్వంభర' పరిస్థితిపై పూర్తి స్పష్టత మాత్రం మేకర్స్‌కే తెలిసి ఉండాలి.

Advertisement