Page Loader
Viswambhara:'విశ్వంభ‌ర' నుంచి మెగా అప్‌డేట్..త్వరలో చిరంజీవి ఇంట్రో సాంగ్
విశ్వంభ‌ర' నుంచి మెగా అప్‌డేట్..త్వరలో చిరంజీవి ఇంట్రో సాంగ్

Viswambhara:'విశ్వంభ‌ర' నుంచి మెగా అప్‌డేట్..త్వరలో చిరంజీవి ఇంట్రో సాంగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2025
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ విశ్వంభ‌ర. ఈ సినిమాపై మెగా అభిమానులు మాత్రమే కాకుండా, సినిమా ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. గత ఏడాది దసరా కానుకగా విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా, ఈ సినిమా నుండి మరో కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం విశ్వంభరలో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శోభి మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాట గురించి చెప్పాలి అంటే,మెగాస్టార్ తన స్వాగ్‌తో, ఎనర్జీతో అభిమానులను అలరించనున్నారు.

వివరాలు 

"బింబిసార" ఫేమ్ వశిష్ట దర్శకత్వం

అలాగే, ఎమ్.ఎమ్. కీరవాణి అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. "మెగా మాస్ బియాండ్ యూనివర్స్ కోసం సిద్ధంగా ఉండండి!" అంటూ చిత్రబృందం సందేశాన్ని ఇచ్చింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి "బింబిసార" ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్