Page Loader
వివి వినాయక్‌కు ఆఫర్ ఇచ్చిన గాడ్ ఫాదర్..!
మెగాస్టార్ చిరంజీవితో వివి వినాయక్ మరో సినిమా తీసే ఛాన్స్

వివి వినాయక్‌కు ఆఫర్ ఇచ్చిన గాడ్ ఫాదర్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 21, 2023
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్ఎస్ రాజమౌళి తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ సంచలనం సృష్టించాడు. ముఖ్యంగా చిరంజీవి-వివి వినాయక్ కాంబినేషన్ను ఏ అభిమాని కాదని చెప్పడు. ఎందుకంటే గతంలో ఈ ఇద్దరి కాంబో అలా వర్క్ చేసింది. ఠాగూర్, ఖైదీ నెంబర్ 150లో చిరంజీవిని చూపించిన విధానం అభిమానులే కాదు, ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు అభిమానుల కోరిక తీరేలా కనిపిస్తోంది. టాలీవుడ్‌లోకి చిరంజీవి రీ-ఎంట్రీ కోసం "ఖైదీ నెం 150"సినిమాను రీమేక్ చేశాడు. అప్పట్లో ఈ సినిమాను వినాయక్ దర్శకత్వం వహిస్తారని అంతా భావించినా అది కుదరలేదు. ప్రస్తుతం వినాయక్ హిందీలో చత్రపతిని రీమేక్ చేసాడు,కానీ అది ఇంతవరకు విడుదలకు సిద్ధం కాలేదు.

చిరంజీవి

చిరుతో హ్యాట్రిక్ చేయాలని ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి వినాయక్‌ని తన ఆఫీస్ కి పిలిచి, హ్యాట్రిక్ చేయాలని వినాయక్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఠాగూర్, ఖైదీ నంబర్ 150 తర్వాత, దర్శకుడు తెలుగులో మరో తమిళ రీమేక్‌ను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. వీరద్దరి కాంబినేషన్ కుదిరితే చిరు మరోసారి వినాయక్‌ని హిట్ ట్రాక్‌లోకి తీసుకొస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే 'భోళా శంకర్‌' సినిమాలో కీర్తి సురేష్‌ చిరుకి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా చిరుకి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరు నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా మొన్న సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.