
వైజయంతీ మూవీస్ వినూత్న ప్రయోగం: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9పోస్టర్లను రిలీజ్ చేసే ప్లాన్
ఈ వార్తాకథనం ఏంటి
దసరా సందర్భంగా టాలీవుడ్ నుండి రకరకాల అప్డేట్లు వస్తున్నాయి.
కొత్త సినిమా టైటిల్ పోస్టర్ల నుండి మొదలుకొని టీజర్లు, ట్రైలర్లు, పాటలు ఇలా వివిధ రకాల ప్రమోషనల్ కంటెంట్ ని ప్రేక్షకుల కోసం అందిస్తున్నారు.
తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కొత్త రకమైన కాన్సెప్ట్ తో ముందుకు వచ్చింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు అమ్మవారిని కొలుస్తారని తెలిసిందే.
ఈ తొమ్మిది రోజులపాటు వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన తొమ్మిది సినిమాల నుండి తొమ్మిది మంది హీరోయిన్ల పోస్టర్లను రిలీజ్ చేస్తామని వైజయంతీ మూవీస్ ఆల్రెడీ ప్రకటించింది.
Details
మొదటిరోజు అతిలోక సుందరి శ్రీదేవి పోస్టర్ రిలీజ్
ప్రకటించినట్టుగానే గడచిన మూడు రోజుల్లో ముగ్గురు హీరోయిన్ల పోస్టర్లను విడుదల చేసింది. అందులో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో నటించిన శ్రీదేవి పోస్టర్ ఉంది.
అలాగే సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సీతగా దగ్గరైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పోస్టర్ ని విడుదల చేశారు.
ఇక మూడవ రోజు నాడు నాగార్జున హీరోగా నటించిన ఆజాద్ సినిమా హీరోయిన్ సౌందర్య పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ మూడు పోస్టర్లు కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. చాలామంది తెలుగు సినిమా అభిమానులు వైజయంతీ మూవీస్ వినూత్న ప్రయోగాన్ని ప్రశంసిస్తున్నారు.
మరి మిగిలిన ఆరు రోజుల్లో ఎవరెవరి ఫోటోలను రిలీజ్ చేస్తారో చూడాలి.