NTR: తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని ఉంది : ఎన్టీఆర్
మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన 'దేవర' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఇక సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్ల భాగంగా ఇటీవల చైన్నైలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ చిత్రసీమలో ప్రసిద్ధ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక తమిళ చిత్రం చేయాలని ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువాదించాలని చెప్పారు.
తెలుగు చిత్ర పరిశ్రమ చైన్నై నుంచే ప్రారంభమైంది
ఈ సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ తనకు చెన్నైతో చిన్ననాటి నుండి అనుబంధం ఉందని, తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడి నుంచే ప్రారంభమై, ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలిందని తెలిపారు. 'దేవర' చిత్రం విజయానికి కారణం చిత్రంలో నటించిన నటీనటులనూ, అలాగే చిత్ర దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, సంగీత దర్శకులకూ క్రెడిట్ అనివార్యమని ఆయన పేర్కొన్నారు. చైన్నైలో జరిగిన ఈవెంట్‌లో 'దేవర' చిత్ర నిర్మాత ప్రసాద్, హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు అనిరుధ్, కెమెరామెన్ రత్నవేలు, గేయరచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.