
Ticket prices: తెలుగు రాష్ట్రాల్లో 'వార్ 2', 'కూలీ' స్పెషల్ షోలు.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఆగస్టు 15న ప్రేక్షకులను అలరించేందుకు రెండు భారీ బడ్జెట్ సినిమాలు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన 'కూలీ', ఎన్టీఆర్, హృతిక్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వార్ 2' రెడీగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ రెండు చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, టికెట్లు హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు టికెట్ బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, నిన్న సాయంత్రం నుంచి బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరల పెంపు లేనట్టు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు విక్రయించనున్నారు.
Details
టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి
మార్నింగ్ షోకు ముందు కేవలం ఒక్క స్పెషల్ షోకే అనుమతి లభించగా, థియేటర్లు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఆ షో ప్రదర్శించనున్నారు. భారీ డిమాండ్ దృష్ట్యా ఈ స్పెషల్ షోల కోసం థియేటర్లు కేటాయించడంలో నిర్వాహకులు విస్తృతంగా కసరత్తు చేసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో, 'కూలీ' విడుదల రోజున ఉదయం 5 గంటలకు అదనపు షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదనంగా సింగిల్ స్క్రీన్‌లలో రూ.75 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధరలు పెంచుకునే వీలును కూడా ఇచ్చింది.
Details
ఆగస్టు 23 వరకు అమల్లో
ఈ ధరలు ఆగస్టు 14 నుంచి 23 వరకు అమల్లో ఉంటాయి. 'వార్ 2' విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ అదనపు షో టికెట్ ధరను రూ.500 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు. అలాగే, ఆగస్టు 14 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధరల పెంపును అనుమతించారు.