Page Loader
War 2: హృతిక్ రోషన్-జూనియర్ ఎన్టీఆర్ ల 'వార్- 2'పై ఆసక్తికరమైన బజ్
War 2: హృతిక్ రోషన్-జూనియర్ ఎన్టీఆర్ ల 'వార్- 2'పై ఆసక్తికరమైన బజ్

War 2: హృతిక్ రోషన్-జూనియర్ ఎన్టీఆర్ ల 'వార్- 2'పై ఆసక్తికరమైన బజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2024
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ,మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ల కలయికలో బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ,ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం "వార్ 2" కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ 2024 మార్చి 7న జపాన్‌లోని టోక్యోలోని చారిత్రాత్మక షావోలిన్ టెంపుల్‌లో ప్రారంభం కానుందని ఆన్‌లైన్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. తన పాత్ర కోసం తీవ్రమైన శారీరక పరివర్తనకు గురైన హృతిక్ రోషన్ సెట్స్‌లో జాయిన్ అవుతాడని పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం శివ కొరటాల దర్శకత్వం వహించిన పాన్-ఇండియన్ ప్రాజెక్ట్, దేవర: పార్ట్ 1తో జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ బిజీ గా ఉన్నాడు.

Details 

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి కెమెరా మెన్ గా బెన్ జాస్పర్

ఈ అవైటెడ్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ షూట్ లో ఏప్రిల్ నుంచి జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి ప్రఖ్యాత ఆస్ట్రేలియా సినిమాటోగ్రాఫర్ బెన్ జాస్పర్ కెమెరాను హ్యాండిల్ చేయబోతున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.