
War 2 OTT: ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు , ఎక్కడంటే .!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం "వార్ 2". ఈ చిత్రంలో కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటించగా.. అనిల్ కపూర్,అశుత్వ్ రాణా, అలియాభట్,బాబీ దేవోల్, శర్వారీ వాఘ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా,యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా ఆదిత్య చోప్రా నిర్మాణ బాధ్యత వహించారు. ఈ చిత్రం ఇండెపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం అక్టోబర్ 9నుంచి స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వస్తుందన్న విషయం ప్రకటించింది.
వివరాలు
కథ ఏంటంటే..?
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కథలో ఇండియన్ రా ఏజెన్సీలోని ప్రముఖ ఏజెంట్ కబీర్ ఒక కోటరీ హంతకుడిగా మారి వివిధ హత్యలను సజావుగా కొనసాగిస్తాడు. ఈ విధంగా, చైనా,రష్యా,శ్రీలంక,మయన్మార్,బంగ్లాదేశ్ వంటి దేశాలు ఒక మిషన్ కోసం కలసి"కలి" అనే ప్రాజెక్ట్ రూపంలో భారతదేశ పతనం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తాయి. ఆ మిషన్‌ను అమలు చేసేందుకు కబీర్‌ను నియమిస్తారు.కాబట్టి, కబీర్‌ను ఆపేందుకు, విక్రమ్ చలపతి ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పోరాడతాడు. అసలు కబీర్‌కీ,విక్రమ్‌కు మధ్య ఉన్న బంధం ఏంటి? "కలి" ప్రాజెక్ట్ వల్ల భారత ప్రధానికి ఏర్పడిన ప్రమాదాన్ని వీరు ఎలా ఎదుర్కొన్నారు? ఈ మిషన్‌లో వింగ్ కమాండర్ కావ్య లూత్ర పాత్ర ఏంటి?ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.