
WAR 2 : విజయవాడలో గ్రాండ్‌గా 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరుకానున్న ఎన్టీఆర్,హృతిక్ రోషన్
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ "వార్ 2". ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలు అయాన్ ముఖర్జీ చేపట్టాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానుంది.
వివరాలు
విజయవాడ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సెట్టయిన వేదిక
మూవీ విడుదలకు ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండగా, ఇద్దరు స్టార్ హీరోల కలయికలో వస్తున్న చిత్రానికి ప్రస్తుత బజ్ మాత్రం సరిపోదని భావించిన తెలుగు హక్కుల్ని దక్కించుకున్న నిర్మాత-డిస్ట్రిబ్యూటర్, సినిమాకి మరింత హైప్ తీసుకురావడానికి భారీ స్థాయిలో ప్రచార ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ఈ ప్రచార భాగంగా ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వేడుక ద్వారా సెన్సేషన్ సృష్టించాలని నిర్మాత నాగవంశీ స్పెషల్ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆగస్టు 10న విజయవాడలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగానంగా ఉన్నా, తాజా సమాచారం ప్రకారం విజయవాడ వేదికగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఈ వేడుకకు హృతిక్ రోషన్
ఈ వేడుకకు ఎన్టీఆర్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా హాజరవుతారని అంచనాలు ఉన్నాయి. ఇది నిజమైతే, "వార్ 2" ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఘనంగా జరుగుతుంది. మరోవైపు, ఈ కార్యక్రమాన్ని ఇప్పటివే అద్భుతంగా నిర్వహించేందుకు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లను ప్రారంభించారు.