Page Loader
Jr. NTR : 'వార్-2' యంగ్ టైగర్ ఫస్ట్ లుక్.. అభిమానుల కోసం ఆసక్తికర అప్‌డేట్
'వార్-2' యంగ్ టైగర్ ఫస్ట్ లుక్.. అభిమానుల కోసం ఆసక్తికర అప్‌డేట్

Jr. NTR : 'వార్-2' యంగ్ టైగర్ ఫస్ట్ లుక్.. అభిమానుల కోసం ఆసక్తికర అప్‌డేట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో డెబ్యూ చేస్తున్న చిత్రం 'వార్ 2' షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు చేరింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి యుద్ధ సీన్లలో మెరుస్తారని బీ టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. దీంతో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉన్న సీన్స్ ఆడియెన్స్‌ని మరింత అలరించనున్నాయి. ఈ సినిమాలో ఈ ఇద్దరి మధ్య వచ్చే డ్యాన్స్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హృతిక్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తే అది ఆడియెన్స్‌కి గుస్ బంప్స్ తెప్పిస్తాయని భావిస్తున్నారు.

Details

ఆగస్టులో 'వార్ 2' రిలీజ్

ఇప్పటికే 'నాటు నాటు' రేంజ్ మాస్ సాంగ్ ను 'వార్ 2'లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు, టైగర్ లుక్, క్యారెక్టర్ గురించి మొదటి లుక్‌ను బయట పెట్టే సమయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సాలిడ్‌గా డిజైన్ చేసి లాక్ చేసారట. కానీ అది రివీల్ చేయడానికి మంచి సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారని సమాచారం. ఈ ఏడాది మే నెలలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 'వార్ 2' టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'వార్ 2' ఆగష్టులో రిలీజ్‌కి సిద్ధమవుతోంది.