Page Loader
Prabhas: ప్రముఖ నిర్మాణ సంస్థ గుడ్‌న్యూస్‌.. ప్రభాస్‌తో మూడు ప్రాజెక్టులు..
ప్రముఖ నిర్మాణ సంస్థ గుడ్‌న్యూస్‌.. ప్రభాస్‌తో మూడు ప్రాజెక్టులు..

Prabhas: ప్రముఖ నిర్మాణ సంస్థ గుడ్‌న్యూస్‌.. ప్రభాస్‌తో మూడు ప్రాజెక్టులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేజీయఫ్‌, కాంతార‌, సలార్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ, తాజాగా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. ప్రభాస్‌తో మూడు సినిమాలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టులు భారతీయ సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్లే విధంగా ఉంటాయని తెలిపింది. అంతేకాకుండా, ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాటిక్ అనుభూతిని అందించనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ వెల్లడించింది.

వివరాలు 

ది హోంబలే ఈజ్‌ కాలింగ్‌ ప్రభాస్

"భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే విధంగా ప్రభాస్‌తో కలిసి మూడు చిత్రాల భాగస్వామ్యం చేయడం చాలా ఆనందకరం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాటిక్ అనుభూతిని సృష్టించాలన్న మా కృషిలో ఇది మరో ముందడుగు. వేదిక సిద్ధమైంది, ముందుకు సాగాల్సిన దారి అపారంగా ఉంది. #Salaar2తో ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకే సిద్ధంగా ఉండండి," అని హోంబలే ఫిల్మ్స్ తెలిపింది. "ది హోంబలే ఈజ్‌ కాలింగ్‌ ప్రభాస్" అంటూ పేర్కొంది. ఈ చిత్రాలు 2026, 2027, 2028 సంవత్సరాల్లో విడుదల కానున్నాయని కూడా ప్రకటించింది. అయితే, 'సలార్‌ 2' మినహా మిగతా ప్రాజెక్టుల వివరాలను మాత్రం తెలియజేయలేదు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

 'రాజాసాబ్‌' చిత్రంలో బిజీగా ప్రభాస్

విజయ్ కిరంగదూర్, ప్రేక్షకులకు వినోదం అందించాలనే లక్ష్యంతో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థను స్థాపించారు. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన 'నిన్నిందలే'తో నిర్మాణ రంగంలో విజయ్ ప్రయాణం ప్రారంభమైంది. 2018లో విడుదలైన కేజీయఫ్‌ చిత్రం సంస్థకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కాంతార‌, సలార్‌ వంటి చిత్రాలు కూడా హోంబలే బ్యానర్‌లో నిర్మితమై విజయం సాధించాయి. గతంలో విడుదలైన సలార్ కోసం ప్రభాస్ తొలిసారి ఈ సంస్థతో కలిసి పనిచేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'సలార్ శౌర్యంగపర్వం' రూపొందనుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం 'రాజాసాబ్‌' చిత్రంలో బిజీగా ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హోంబలే ఫిల్మ్స్ చేసిన ట్వీట్