LOADING...
Elvish Yadav: 'డబ్బులు ఇవ్వకపోతే కాల్చేస్తాం'.. ప్రముఖ యూట్యూబర్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
'డబ్బులు ఇవ్వకపోతే కాల్చేస్తాం'.. ప్రముఖ యూట్యూబర్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

Elvish Yadav: 'డబ్బులు ఇవ్వకపోతే కాల్చేస్తాం'.. ప్రముఖ యూట్యూబర్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ యూట్యూబర్‌, ఎల్విష్ యాదవ్‌కు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి ఆయనను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకోవడం సంచలనంగా మారింది. ఎల్విష్‌కు ఆ గ్యాంగ్‌ నుంచి బెదిరింపు సందేశాలు వచ్చినట్లు సమాచారం. రెండు రోజుల్లోగా రూ.10 కోట్ల ఎక్స్టార్షన్ మనీ చెల్లించాలని, లేని పక్షంలో కాల్చి చంపేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కేవలం ఎల్విష్‌కే కాకుండా, ఆయన తండ్రికి కూడా ఇలాంటి బెదిరింపు మెసేజ్‌లు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంతో వెంటనే స్పందించిన ఎల్విష్ యాదవ్‌, గురుగ్రామ్‌లోని సెక్టార్-56 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

వివరాలు

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విదేశీ నంబర్‌ నుంచి వాట్సాప్‌ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు ఎల్విష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పటికే గతంలో ఎల్విష్ నివాసంపై కాల్పులు జరిగిన ఘటనలు వెలుగులోకి రావడంతో, తాజా బెదిరింపులు అభిమానుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మరోవైపు, 'పాముల విషం' సరఫరా కేసులో అరెస్టై, అనంతరం సుప్రీంకోర్టు నుంచి కూడా తీవ్ర వ్యాఖ్యలు ఎదుర్కొన్న ఎల్విష్ యాదవ్‌ ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ బెదిరింపుల వ్యవహారంలో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Advertisement