
Weapons: రూ.335 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'వెపన్స్'.. రూ.2000 కోట్ల కలెక్షన్స్ సొంతం!
ఈ వార్తాకథనం ఏంటి
హారర్ సినిమాలు ఇష్టమా? అయితే ఈ మూవీ మీ కోసం! హాలీవుడ్‌లో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన 'వెపన్స్' కొత్త కంటెంట్, సస్పెన్స్, ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసింది. జాక్ క్రెగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హాస్ వంటి స్టార్స్ నటించారు. ఆగస్ట్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తరువాత, సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, ప్రేక్షకులు థియేటర్లలో క్యూ కట్టారు. తక్కువ సమయంపై అత్యధిక వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌లో సంచలనం సృష్టించింది.
Details
సెప్టెంబర్ 9నుంచి స్ట్రీమింగ్
ఇప్పటివరకు 23.5 మిలియన్ డాలర్స్, దాదాపు రూ. 2,000 కోట్ల కలెక్షన్స్ సాధించింది. సెప్టెంబర్ 9 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లే తదితర ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వస్తుంది. కానీ, ఫ్రీగా కాదు! ఈ సినిమాను రెంట్ విధానంలో మాత్రమే చూడవచ్చు. థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్నప్పటికీ, మేకర్స్ ఆకస్మాత్తుగా ఓటీటీలోకి తీసుకువచ్చారు. ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.