
Naga Chaitanya: తండేల్ మూవీ కథ ఆధారంగా వెబ్‌సిరీస్.. టైటిల్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీ టాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్‌లో ఒకటిగా రికార్డైంది.
వెబ్‌సిరీస్‌గా మారుతున్న తండేల్ కథ
తండేల్ సినిమాకు మూలకథగా పని చేసిన చింతకింది శ్రీనివాసరావు రచించిన మున్నీటి గీతలు నవల ఆధారంగా ఇప్పుడు ఓ వెబ్‌సిరీస్ రూపొందించనున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ వెబ్‌సిరీస్‌ను 'అరేబియన్ కడలి' అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఇదే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
Details
థ్రిల్, లవ్‌తో అరేబియన్ కడలి
క్రిష్ స్వయంగా దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూమెంట్‌తో పాటు ఓ భావోద్వేగ లవ్ స్టోరీ కూడా కలగలిపినట్టు సమాచారం. అయితే ఇందులో నటించే తారాగణం వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
మున్నీటి గీతల కథలోని కీలక అంశాలు
ఈ నవల కథ మత్స్యకార గ్రామమైన మత్స్సవేనంలోని బెస్తల చుట్టూ తిరుగుతుంది.
జీవనోపాధి కోసం వారు గుజరాత్‌లోని అరేబియా సముద్రంలో చేపల వేటకే వెళ్లి అక్కడే ఎనిమిది నెలలు గడుపుతుంటారు.
ఓ సందర్భంలో GPS పని చేయకపోవడం వల్ల పోలారావు బోటు పాకిస్థాన్ జలాల్లోకి వెళుతుంది. అక్కడ పాకిస్థాన్ కోస్ట్ గార్డులు 27 మంది మత్స్యకారులను అరెస్టు చేసి జైలులోకి పంపిస్తారు.
Details
ప్రేమకథలో ఎమోషన్
పోలారావు, ఎర్రమ్మల ప్రేమకథను కూడా రచయిత ఎంతో హృదయపూర్వకంగా వివరించారు.
ప్రియుడిని విస్మరించి, మరొకరితో వివాహానికి సిద్ధపడే ఎర్రమ్మ పాత్రలో ఉన్న భావోద్వేగం, సంఘర్షణలను నవలలో గొప్పగా ఆవిష్కరించారు.
ఈ పాత్రల ఆధారంగానే తండేల్‌లో నాగచైతన్య, సాయిపల్లవి క్యారెక్టర్స్ డిజైన్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
అనుష్క 'ఘాటి' కూడా సిద్ధంగా ఉంది
ఇక దర్శకుడు క్రిష్ మరోవైపు అనుష్కను ప్రధాన పాత్రలో తీసుకొని ఘాటి అనే యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 18న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.