LOADING...
The Bads of Bollywood: ఆర్యన్ ఖాన్ డైరెక్షన్‌లో వెబ్ సిరీస్.. ట్రైలర్‌లో రాజమౌళి, అమిర్ ఖాన్!

The Bads of Bollywood: ఆర్యన్ ఖాన్ డైరెక్షన్‌లో వెబ్ సిరీస్.. ట్రైలర్‌లో రాజమౌళి, అమిర్ ఖాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 09, 2025
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఆర్యన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న తాజా వెబ్ సిరీస్ పేరు 'Bads of Bollywood'. ఈ సిరీస్‌లో 'కిల్' సినిమాతో సూపర్ హిట్ సాధించిన నటుడు 'లక్ష్య' కథానాయ‌కుడిగా నటించనున్నారు. అదేవిధంగా, కింగ్ ఖాన్ 'షారుఖ్ ఖాన్', రాజమౌళి, ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖులు అతిథి పాత్రల్లో దర్శనమివ్వబోతున్నారు. 'Bads of Bollywood' సెప్టెంబర్ 18 నుంచి 'నెట్‌ఫ్లిక్స్' వేదికపై స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

Details

మూవీపై భారీ అంచనాలు

ఈ సందర్భంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు, ఇందులో రాజమౌళి, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, షారుఖ్ ఖాన్ తదితరులు సందడి చూపించారు. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు, దాంతో అది భారీ అంచనాలతో ప్రేక్షకులను ఎదురుచూస్తోంది.