
Chiranjeevi: ఫ్లైట్‌లో పెళ్లి రోజు సెలబ్రేషన్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అగ్ర కథానాయకుడు చిరంజీవి, సురేఖ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు.
తమకు ఎంతో ప్రత్యేకమైన ఈ రోజును ఫ్లైట్‌లో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
తన కలల జీవిత భాగస్వామిగా సురేఖ తన జీవితంలో అడుగుపెట్టినందుకు తానెప్పుడూ అదృష్టంగా ఫీలవుతుంటానని చెప్పారు. ఆమే తన ధైర్యం, నమ్మకం అని పేర్కొన్నారు.
ఆమె ఉనికి తనకు అద్భుతమైన ప్రేరణని ఇస్తుందని, ఈ ప్రత్యేక క్షణాలను ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయడానికి వినియోగించుకుంటున్నానని, థాంక్యూ మై సోల్‌మేట్ సురేఖ అని చిరంజీవి తన భావోద్వేగాలను వ్యక్తపరిచారు.
Details
ఫ్లైట్ జర్నీలో నాగార్జున, అమల, నమ్రత
పెళ్లి రోజు వేడుకల్లో భాగంగా చిరంజీవి దంపతులు దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ చేశారు.
ఫ్లైట్ జర్నీలో నాగార్జున, అమల, నమ్రత, తదితరులు చిరంజీవి దంపతులతో కలిసి ప్రయాణించారు.
పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఫ్లైట్‌లోనే చిరు - సురేఖ జంటకు ప్రత్యేక కేక్ కట్ చేయించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.