Trending Folk Song : ఏం బీట్ రా బాబూ.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా పాటలను మించి వ్యూస్, రెస్పాన్స్ సాధిస్తూ యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. పల్లె గొంతుల్లో పుట్టే ఈ పాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. భాష అర్థం కాకపోయినా దేశవ్యాప్తంగా వినిపిస్తూ అందరినీ అలరిస్తున్నాయి. ఇప్పుడెక్కడ చూసినా, ఎక్కడ విన్నా పల్లె పాటలే మారుమోగుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగలు, స్కూల్ వీడ్కోలు కార్యక్రమాలు వంటి ప్రతి వేడుకలోనూ ఈ ఫోక్ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఇప్పటికే అనేక పాటలు ట్రెండ్ అవుతుండగా,తాజాగా మరో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల రోజుల క్రితం విడుదలైన ఈ పాటకు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్టెప్పులు వేస్తున్నారు.
Details
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పాట
ఆ పాటే "కాళ్ల కడియాల్ లేవు..". "కాళ్ళ గడియాలు లేవు వంగిన జుంపా లెక్కలయ్యా, కాళ్ళే కాదిమ్మనయో వంగిన జుంపా లెక్కలయ్యా.. కాళ్ళ గడియాలు జెట్టా రింగుల చుట్టూ వెంకటమ్మ, పెట్టు పడినా చెత్త రావే రింగుల చుట్టూ వెంకటమ్మ" అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో వేగంగా దూసుకుపోతోంది. ప్రతి వయస్సువారు ఈ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ పాటను ఫోక్ సింగర్ వెంకటమ్మ స్వయంగా రాసి ఆలపించగా, దండు హనుమంతు కూడా తన గాత్రంతో ఆకట్టుకున్నారు. మాస్ బీజీఎమ్‌ను రాజు మాల్ అందించడంతో ఈ పాటకు మరింత ఊపు వచ్చింది. అలాగే బిట్టు, ఏఎంఆర్ మాస్టర్ ఈ పాటకు ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.