
Tiger 3: 'టైగర్-3' థియేటర్‌లో టపాసులు పేల్చిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు
ఈ వార్తాకథనం ఏంటి
సల్మాన్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'టైగర్-3' దీపావళి సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది.
ఈ సందర్భంగా టైగర్ 3 మూవీ ఆడుతున్న ఓ థియేటర్‌లో సల్మాన్ అభిమానులు అత్యుత్సాహాన్ని చూపించారు.
మూవీలో సల్మాన్‌ఖాన్ ఎంట్రీ సమయంలో ఓ థియేటర్లలో అభిమానులు పటాకులు పేల్చారు.
సల్మాన్ అభిమానులు క్రాకర్స్ పేల్చుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మహారాష్ట్రలోని మాలెగావ్ థియేటర్‌లో జరిగినట్లు తెలుస్తోంది.
బాణాసంచా పేలిన తర్వాత సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తుంది.
ఈ క్రమంలో థియేజర్‌లో టపాసులు పేల్చడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సల్మాన్ ఖాన్ అభిమానులపై విమర్శలు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Is That Even A Question Baap Tho Baap Hee Hotha Hey😂
— 101™ REPORTS (@viratkohali1231) November 13, 2023
PATHAAN KA BAAP TIGER 🔥#SalmanKhan #Tiger3pic.twitter.com/yhvFeVWGlP